Friday, October 11, 2024

Hebba Patel: హెబ్బాకు బ్రేక్ వ‌స్తుందా…

కుమారి 21ఎఫ్ తో హెబ్భా పటేల్ కి యూత్ లో సూపర్ ఫాలోయింగ్ రాగా అమ్మడు అమ్మడు సెలెక్ట్ చేసుకున్న సినిమాల వల్ల కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. ఆ టైం లో సరైన కథలు ఎంపిక చేసుకుని ఉంటే కచ్చితంగా హెబ్భా ఇప్పుడు ఉన్న క్రేజ్ కన్నా డబుల్ ట్రిపుల్ సంపాదించేది.

- Advertisement -

ఇప్పటికీ హెబ్భా పటేల్ సినిమా అంటే ఆడియన్స్ లో ఎంతోకొంత అటెన్షన్ ఉంది. అయితే ఈమధ్య అసలేమాత్రం అవకాశాలు లేని టైం లో అమ్మడు స్పెషల్ సాంగ్స్, కెమియో రోల్స్ చేస్తూ వచ్చింది. అలాంటివి చేయడం వల్ల హెబ్భా కెరీర్ కు హెల్ప్ అవ్వక పోగా ఇంకా ఆమె గ్రాఫ్ పడిపోయేలా చేశాయి.

సోలోగా హెబ్భా పటేల్ కు ఈ టైం లో ఛాన్స్ ఇస్తారా అనుకుంటున్న టైం లో బాల శేఖరుని డైరెక్షన్ లో ఒక సినిమాతో అవకాశం అందుకుంది. 30 వెడ్స్ 21 వెబ్ సీరీస్ హీరో చైతన్య రావు లీడ్ రోల్ లో నటిస్తున్న హనీమూన్ ఎక్స్ ప్రెస్ సినిమాలో హెబ్భా పటేల్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో ట్రెడిష‌న‌ల్ గానూ, హాట్ హాట్ గాను నటించ‌న‌ట్లు టాక్.

Advertisement

తాజా వార్తలు

Advertisement