Wednesday, October 2, 2024

హరిహర వీరమల్లు… హై అండ్ సూపర్ స్టంట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 17వ శతాబ్దపు కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ దొంగ గా కనిపించబోతున్నాడు. కాగా ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన మోషన్ పోస్టర్, పవన్ కళ్యాణ్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా హరిహర వీరమల్లు చిత్రానికి శామ్ కౌశల్ యాక్షన్ సన్నివేశాలకు పని చేశారు. తాజాగా ఇక ఇదే విషయమై ఈ చిత్రంలోని యాక్షన్ సీక్వెన్సులపై డైరెక్టర్ క్రిష్ తో తన అనుభవాలను శ్యామ్ కౌషల్ సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీనిపై స్పందించిన క్రిష్.. ఇందులో హై అండ్ సూపర్ స్టంట్ కోసం పని చేస్తున్నట్లు తెలిపాడు.

కాగా గతంలో క్రిష్, ధూమ్ 3, క్రిష్ 3, దంగల్బాజీరావ్ మస్తానీ, వంటి భారీ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్ గాశ్యామ్ కౌషల్ పని చేశారు. అలాగే కింగ్ నాగార్జున వైల్డ్ డాగ్ చిత్రానికి కూడా శ్యామ్ కౌషల్ యాక్షన్ డైరెక్టర్ గా పని చేశారు. మరి హరిహర వీరమల్లులో పవన్ ను ఏ విధంగా చూపిస్తారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement