Wednesday, May 15, 2024

Hari Hara Veera Mallu లేటెస్ట్ అప్‌డేట్..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ‘వకీల్ సాబ్’ తర్వాత పవన్ 27వ సినిమాగా సెట్స్ మీదకు వచ్చిన ఈ ప్రాజెక్ట్, ఇంకా సెట్స్ మీదనే ఉంది. నాలుగేళ్లుగా షూటింగ్ దశలోనే ఉన్న ఈ మూవీ తాజాగా అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్‌. త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకువస్తామని, ఆడియన్స్ విపరీతమైన ఉద్విగ్నతకు గురికావడం ఖాయమని తెలిపారు.

అయితే, ప్రస్తుతం ‘హరిహర వీరమల్లుస మూవీ హై ఎండ్ వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటోందని. ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాల్లో అంతర్జాతీయ నిపుణులు ‘హరిహర వీరమల్లు’ గ్రాఫిక్స్ పనుల్లో పాలుపంచుకుంటున్నట్టు ప్రకటించారు. అద్భుతమైన గ్రాఫిక్స్ నైపుణ్యానికి నిదర్శనంలా, ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో సన్నివేశాలను గ్రాఫిక్స్ తో మిళితం చేసి సరికొత్త థ్రిల్ ను అందిస్తామని మూవీ యూనిట్ ప్రకటించింది.

మెగాసూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏఎం రత్నం సమర్పణలో ఏ.దయాకర్ రావు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ మూవీపై పవన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ ఓ శక్తిమంతమైన బందిపోటు పాత్ర పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement