Sunday, April 28, 2024

బిజినెస్‌మెన్ రీ-రిలీజ్ తో ఫ్యాన్స్ కు పూన‌కాలే..

పోకిరి సినిమా రీ రిలీజ్ తో మహేష్ బాబు కొత్త ట్రెండ్ ని సెట్ చేశాడు. ఈ సినిమా వార్షికోత్సవం సందర్భంగా మళ్లీ విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. టాలీవుడ్ లో పాత సినిమాలను మళ్లీ విడుదల చేయడం ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లోనే ఉంది. పోకిరి త‌రువాత‌ ప్రేక్షకులు మెచ్చిన పలు సినిమాలు మ‌ళ్లీ థియేట‌ర్ల‌లోకి వచ్చాయి.

రీ రిలీజ్ లోనూ అద్భుతమైన క‌లెక్ష‌న్ల‌తో విజయాలు సాధించాయి. కాగా, మహేష్ బాబు సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాల్లో మరొకటి మళ్లీ థియేట‌ర్ల‌లో దుమ్మురేప‌నుంది. 2012లో విడుదలైన బిజినెస్‌మెన్.. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల (ఆగస్ట్) 9న రీ రిలీజ్ కి సిద్దంగా ఉంది. 40 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన బిజినెస్‌మేన్‌ 90 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మ‌రోసారి థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement