Thursday, May 2, 2024

పవన్ టైటిల్ పై ఫ్యాన్స్ లో ఉత్కంఠ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో దగ్గుబాటి రానా కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా మలయాళం లో సూపర్ హిట్ సాధించిన అయ్యప్పనుమ్ కొషియమ్ కు రీమేక్ చిత్రంగా తెరకెక్కుతుంది. ఇందులో భీమ్లా నాయక్ గా పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.

అయితే ఈ సినిమాకు సంబంధించి ఆగస్ట్ 15న టైటిల్ ను అనౌన్స్ చేయబోతున్నారు. ఈనేపథ్యంలోనే అందుకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు భీమ్లా నాయక్ అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement