Wednesday, May 1, 2024

18న దుల్క‌ర్ స‌ల్మాన్ ‘గ‌న్స్ అండ్ గులాబ్స్’ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

మ‌ల‌యాళ స్టార్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ తాజాగా ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకొస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సిరీస్ నుంచి ఫ‌స్ట్ లుక్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌ను విడుద‌ల చేయ‌గా అవి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్‌లో దుల్క‌ర్ స‌ల్మాన్ పాత్ర‌పై మేక‌ర్స్ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు.
‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ వెబ్‌సిరీస్‌లో దుల్క‌ర్ పోలీసు అధికారిగా నటిస్తున్నాడు. తాజాగా ఈ పాత్ర‌పై మేక‌ర్స్ సోష‌ల్ మీడియాలో తెలుపుతూ.. “అయన పరిశోధన ప్రాణాంతకం. అయన స్వాగ్ భ‌య‌న‌కం, సమర్పిస్తున్నాం గన్స్‌ అండ్‌ గులాబ్స్ ప్ర‌పంచం నుంచి అర్జున్ వర్మ” అంటూ పోస్ట‌ర్ రిలీజ్ లో పేర్కొంది.

‘ద‌ ఫ్యామిలీమ్యాన్‌’ , ‘ఫర్జీ’ ( లాంటి వెబ్‌ సిరీస్‌లతో సూప‌ర్ హిట్స్ అందుకున్న దర్శకులు రాజ్‌ అండ్ డీకే ఈ వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. డీ2ఆర్ ఫిల్మ్స్; నెట్‌ఫ్లిక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సిరీస్‌లో రాజ్ కుమార్ రావు , ఆదర్శ్‌ గౌరవ్, గుల్షన్‌ దేవయ్య, గౌత‌మ్ శ‌ర్మ‌ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఆగ‌ష్టు 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవ్వ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement