Sunday, April 28, 2024

మెగాస్టార్ మూవీపై డీఎస్పీ లీక్.. ఈ వారంలోనే రిలీజ్ కానున్న ఫ‌స్ట్ సింగిల్

దర్శకుడు బాబీ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలకమైన పాత్రలో క‌నిపించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇద్దరు బిగ్గెస్ట్ మాస్ హీరోలు కలసి వస్తుండటంతో సినిమాపై చిరు అభిమానులుకు భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే.. కొద్దిసేపటి క్రితం ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ఈ వారంలో రిలీజ్ కాబోతున్నట్టు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. ఈ పాటలో చిరు చేసిన డ్యాన్స్‌కి తాను ఫిదా అయ్యానని, ఎగ్జైట్‌మెంట్‌లో ఈ వార్తను లీక్ చేశానని చెప్పాడు. డీఎస్పీ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం ఈ పాటకు ‘బాస్ పార్టీ’ అని పేరు పెట్టినట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో చిరు సరసన శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా కూడా ఓ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement