Wednesday, May 1, 2024

డెవిల్ ప్ర‌మోష‌న్స్ షురూ.. ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ కి డేట్ ఫిక్స్

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియన్ స్పై థ్రిల్లర్ డెవిల్. అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కుతున్న‌ది. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ గా న‌టిస్తోంది. కాగా, మూవీకి సంబంధించిన‌ ప్రమోషన్ల‌ను ఆ చిత్ర యూనిట్ ప్రారంభించింది. సెప్టెంబరు 19న ఈ సినిమా మొదటి ట్రాక్ “మాయే చేసీ” విడుదల కానున్నట్లు మేకర్స్ తాజాగా వెల్లడించారు. ఈ పాటకు ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ స్వరం అందించారు. హర్షవర్ధ రామేశ్వర్ సంగీత స‌మ‌కూర్చారు.

ఇక‌.. కళ్యాణ్ రామ్, సంయుక్త మెయిన్ రోల్స్ చేస్తుండ‌గా.. వీరిద్ద‌రి మధ్య కెమిస్ట్రీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మెక‌ర్స్ తెలిపారు. కాగా, ఇంతకుముందు వీరిద్దరూ ‘బింబిసార’ మూవీలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. కాగా, శ్రీకాంత్ విస్సా ఈ చిత్రానికి కథ, మాట‌లు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. నవంబర్ 24న థియేటర్ల లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement