Saturday, October 12, 2024

నాగా చైతన్య ‘కస్టడీ’ ఫస్ట్ సింగిల్ కి డేట్ ఫిక్స్..

అక్కినేని నాగ చైతన్య లాస్ట్ మూవీ ‘థ్యాంక్యూ’ బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశను మిగిల్చింది. కాగా, రానున్న తెలుగు-తమిళ ద్విభాషా సినిమా ‘కస్టడీ’తో బలమైన కంబ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు నాగ చైతన్య. కోలీవుడ్ ఫిల్మ్ మేకర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.

కాగా, మేకర్స్ ఈ రోజు మొదటి సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. ‘హెడ్ అప్ హై’ అనే టైటిల్ తో ఏప్రిల్ 10న ఈ పాటను రిలీజ్ చేయనున్నారు. పేరుకు తగ్గట్టుగానే ఈ పాట పోలీసు అధికారుల గొప్పతనాన్ని చాటిచెబుతుంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ టీజర్‌కు సినీ ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

మాస్ట్రో ఇళయరాజా, లిటిల్ మాస్ట్రో యువన్ శంకర్ స్వరాలు సమకూరుస్తున్నారు. కృతి శెట్టి కథానాయికగా కనిపించనుంది. చైతన్యకు విలన్ పాత్రలో అరవింద్ స్వామి నటిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి కస్టడీ చిత్రాన్ని నిర్మించారు. ప్రియమణి, సంపత్‌రాజ్‌, ప్రేమ్‌జీ, వెన్నెల కిషోర్‌, ప్రేమి విశ్వనాథ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కస్టడీ మే 12న విడుదల అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement