Monday, May 6, 2024

Bedurulanka 2012 | ఆకట్టుకునే పోస్టర్‌.. రిలీజ్ డేట్ వెల్లడించిన మేక‌ర్స్

టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ అప్ క‌మింగ్ మూవీ బెదురులంక 2012. ఈ సినిమాని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించగా.. డైరెక్టర్ క్లాక్స్ దర్శకత్వం వహించారు. కొన్ని నెలల క్రితం మైవీ నుండి విడుదలైన టీజర్ ప్రేక్షకులను అలరించింది. కాగా, ఈ సినిమా మార్చిలో విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు మేకర్స్ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను రివీల్ చేసి.. మూవీ రిలీజ్ డేట్ ని వెల్ల‌డించారు. పోస్ట‌ర్ ఆదారంగా చూస్తే ఈ సినిమా వ‌చ్చే నెల (ఆగస్టు) 25 న ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఈ మూవీలో కార్తికేయ జంట‌గా నేహా శెట్టి నటించింది.

ఔట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, వెన్నెల కిషోర్, సత్య, గోపరాజు రమణ, రాజ్ కుమార్ కసిరెడ్డి, ఎల్బీ శ్రీరామ్, సురభి ప్రభావతి, అనితానాథ్, కిట్టయ్య, దివ్య నార్ని ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement