Friday, May 3, 2024

ఆర్ ఎక్స్ 100 ‘కార్తికేయ’ బెదురులంక 2012 మూవీ ట్రైల‌ర్ రిలీజ్…

YouTube video

యదార్థ సంఘటనల ఆధారంగా ఆర్‌ఎక్స్‌100 హీరో కార్తికేయ ప్రధాన పాత్రలో నటిస్తున్న మూవీ బెదురులంక 2012. ఈ మూవీకి క్లాక్స్‌ దర్శకుడు. సరిగ్గా పదకొండేళ్ల క్రితం ప్రపంచాన్ని వణికించిన యుగాంతం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. బెదురలంక అనే ఊర్లో చోటు చేసుకున్న వింత పరిణామాలను తెరపై చూపించబోతున్నట్లు ఇప్పటికే టీజర్‌తో దర్శకుడు క్లాక్స్‌ ఓ క్లారిటీ ఇచ్చేశాడు. ఆగస్టు 25న రిలీజ్‌ కాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి హైపే ఉంది.


ఇక తాజాగా మేకర్స్‌ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్‌ చేశారు. యుగాంతం చుట్టు జరిగిన పరిణామాలను క్లాక్స్ సర్కాస్టిక్‌గా, హ్యూమరస్‌గా చూపించబోతున్నట్లు ట్రైలర్‌తో స్పష్టమయింది. ట్రైలర్‌ మొత్తం ఫన్నీగానే సాగింది. కార్తికేయ, నేహాశర్మ కెమెస్ట్రీ బాగుంది.. మణిశర్మ బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్‌ వేరే లెవల్లో ఉంది. లౌక్య ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై రవింద్ర బెనర్జీ ఈ సినిమాను నిర్మించాడు. ఈ ట్రైల‌ర్ ను రామ్ చ‌ర‌ణ్ విడుద‌ల చేశాడు.
Advertisement

తాజా వార్తలు

Advertisement