Friday, April 26, 2024

మరోసారి థియేటర్లలోకి వస్తున్న బాద్​షా.. టాలీవుడ్​లో కొనసాగుతున్న రీ‌‌-రిలీజ్​ ట్రెండ్​

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కొన‌సాగుతూనే ఉంది. ఇప్ప‌టికే మ‌హేష్ బాబు పోకిరి, ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌ల్సా, బాల‌కృష్ణ చెన్న‌కేశ‌వ‌రెడ్డి, ప్ర‌భాస్ బిల్లా, వర్షంతో పాటు ప‌లు సినిమాలు థియేట‌ర్ల‌లో రీ-రిలీజ్ అయ్యాయి. మరోసారి భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి. తాజాగా ఈ రీ రిలీజ్ ట్రెండ్‌లోకి ఎన్టీఆర్ సినిమా ఒకటి చేరింది.

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా శ్రీనువైట్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఫన్ & యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘బాద్‌షా’ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ నెల 19న అంటే రేపు బాద్‌షా మరోసారి బరిలోకి దిగనున్నాడు. ఎన్టీఆర్ శ్రీనువైట్ల క‌ల‌యిక‌లో తొలిసారి రూపొందిన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ ఈ సినిమాలో బ్ర‌హ్మానందం కామెడీ ప్రేక్ష‌కుల్ని అల‌రించింది. 4కే టెక్నాల‌జీతో ఈ సినిమాను రి రీలీజ్ చేయనున్నట్టు నిర్మాత నట్టికుమార్ తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌లోనూ బాద్‌షా రీ రిలీజ్ కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement