Friday, May 3, 2024

స్టైలిష్ స్టార్ మరో రికార్డ్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా సినిమాకు అభిమానులకు కొత్తదనం చూపించడంలో అల్లుఅర్జున్ ముందుంటారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అల్లు అర్జున్ ఎప్పటికప్పుడు తన సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ను అలాగే తన పిల్లల ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. మరోవైపు బన్నీ కి సోషల్ మీడియాలో ఉండే ఫాలోయింగ్ కూడా విపరీతంగా ఉంటుంది.

కాగా తాజాగా ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ విషయంలో ఓ సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేశాడు బన్నీ. ఫాస్టెస్ట్ 12 మిలియన్ ఫాలోవర్స్ ను సాధించిన సౌత్ ఇండియన్ స్టార్ గా నిలిచాడు. మొదట ఆ మార్క్ ను విజయ్ దేవరకొండ అందుకున్నాడు. ఇప్పుడు బన్నీ కూడా అందుకున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్నాడు. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement