Wednesday, April 24, 2024

రీ-రిలీజ్ కి రెడీ అయిన అల్లు అర్జున్ ఐకానిక్ మూవీ..

ప్రస్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. స్టార్ హీరోల మూవీస్ రీ-రిలీజ్ చేస్తూ, ఫ్యాన్స్ ను అలరిస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మూవీ ఒకటి ఈ లిస్ట్ లోకి వచ్చేసింది. సూపర్ హిట్ అయిన దేశముదురు సినిమా రీ-రిలీజ్ కి రెడీ అవుతోంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే నెల (ఏప్రిల్) 8న ఈ మూవీని మరోసారి రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో హన్సిక హీరోయిన్ గా నటించగా, చక్రి సంగీతం అందించారు. ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప ది రూల్ చిత్రం తో బిజీగా ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement