Friday, April 26, 2024

‘ఓ మై గాడ్ 2’లో..శివుడిగా అక్ష‌య్ కుమార్..

ఈ మ‌ధ్యకాలంలో పిరియాడిక‌ల్ చిత్రాలు..సైన్స్ ఫిక్ష‌న్ మూవీస్..భ‌క్తిర‌స చిత్రాలపై దృష్టిసారించారు ద‌ర్శ‌క‌..నిర్మాత‌లు. ఇప్ప‌టికే ఆదిపురుష్ లో రాముడిగా క‌నిపించ‌నున్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. కాగా బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఓమైగాడ్ కి సీక్వెల్ గా తెర‌కెక్కిస్తోన్న ‘ఓ మై గాడ్ 2’ లో న‌టిస్తున్నారు. అక్ష‌య్ కుమార్ రీసెంట్ గా న‌టించిన చిత్రాల‌న్నీ విభిన్నంగా..ప్రేక్ష‌కుల‌ను ఆలోజింప‌చేసేవిగా ఉంటున్నాయి. ప‌లు చిత్రాల‌తో హిట్ మీద హిట్ కొడుతున్నారాయ‌న‌.

‘ఓ మై గాడ్ 2’ని తెర‌కెక్కిస్తోన్న విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్ శివుడిగా కనిపించనున్నాడు. ఈ సినిమాకి అమిత్‌ రాయ్ దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. కేప్‌ ఆఫ్‌ గాడ్‌ ఫిల్మ్‌ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌ని ట్విట్టర్ వేదిక‌గా రిలీజ్ చేశారు. నిజాయతీతో కూడిన ప్రయత్నమే ఈ చిత్రం. ఆ ఆదియోగి ఆశీర్వాదాలు మా ప్రయాణమంతా ఉండాలని ఆశిస్తున్నాం. అలాగే మీ ఆశీర్వాదం కూడా మాకు కావాలి, హర హర మహదేవ్ అని ట్విట్ట‌ర్ లో అక్ష‌య్ కుమార్ పోస్ట్ చేశాడు. ఈ చిత్రంలో పంకజ్‌ త్రిపాఠి, యామీ గౌతమ్ కీలక పాత్రలు పోషించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement