Friday, May 17, 2024

జూన్ 2న అభిరామ్ అహింస‌…

వైవిధ్యమైన ప్రేమకథా చిత్రాలను రూపొందించిన దర్శకుడు తేజ తన సినిమాల ద్వారా నూతన నటీనటులను పరిచయం చేశారు. తాజాగా అభిరామ్ ను హీరోగా అరంగేట్రం చేయిస్తున్నారు. సినిమా పేరు అహింస. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేత పి కిరణ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. . తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. జూన్‌ 2న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన విడుదల తేదీ పోస్టర్‌ లో అభిరామ్‌ లుక్‌ ఆకట్టుకుంది
ఈ చిత్రానికి ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌ . అనిల్‌ అచ్చుగట్ల సంభాషణలు అందిస్తున్నారు. అభిరామ్‌, గీతిక, రజత్‌ బేడీ, సాధా, రవి కాలే, కమల్‌ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవి ప్రసాద్‌ తదితరులు. అభిరామ్‌, గీతికా తివారీ, రజత్‌ బేడీ, సదా, రవి కాలే, కమల్‌ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవి ప్రసాద్‌ తదితరులు నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement