Saturday, March 2, 2024

పవన్ కళ్యాణ్ ‘OG’ సెట్స్‌లో చేరిన‌ అర్జున్ దాస్

స్టైలిష్ డైరెక్టర్ సుజీత్, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ OG టాలీవుడ్ మోస్ట్ అవేయిటెడ్ మూవీస్ లో ఒకటి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటిస్తుంది. యాక్షన్ లోడ్లతో కూడిన స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ మూవీగా తెర‌కెక్కుతుండ‌గా.. ఇటీవల, నటుడు ప్రకాష్ రాజ్ ఈ మూవీ సెట్స్‌లో చేరారు..

ఇప్పుడు తాజాగా.. కైదీ, మాస్టర్ సినిమాల‌లో తన నటనతో ఖ్యాతి గడించిన తమిళ నటుడు అర్జున్ దాస్ ఈ రోజు చిత్ర‌ తారాగణంలో చేరారు. అర్జున్ ఇటీవల బుట్ట బొమ్మతో తన టాలీవుడ్ డెబ్యూలో కనిపించాడు. కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ విక్రమ్‌లో కూడా కనిపించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement