Tuesday, July 23, 2024

Aishwarya Arjun | గ్రాండ్‌గా యాక్షన్‌ కింగ్ అర్జున్ కుమార్తె వివాహం..

సీని నటుడు, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు, హీరోయిన్ ఐశ్వర్య పెళ్లి గ్రాండ్ గా జరిగింది. తమిళ సీనియర్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో… ఐశ్వర్య వివాహం ఘనంగా జరిగింది. చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక రిసెప్షన్ జూన్ 14న చెన్నై లీలా ప్యాలెస్‌లో గ్రాండ్‌గా జరగనుంది. అయితే ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు వైరల్‌గా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement