Friday, May 10, 2024

Awards: స‌త్య షార్ట్ ఫిల్మ్ కు 8 అంత‌ర్జాతీయ అవార్డులు

సాయిధరమ్ తేజ్, స్వాతి నటించిన షార్ట్ ఫిల్మ్ ‘సత్య’ ఏకంగా 8 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అనేక అవార్డులు సొంతం చేసుకున్న ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. సాయిధరమ్ తేజ్, స్వాతి జంటగా నవీన్ విజయ్ కృష్ణ ‘సోల్ ఆఫ్ సత్య’ పేరుతో షార్ట్ ఫిల్మ్ రూపొందించారు.

ఈ షార్ట్ ఫిల్మ్‌ను గత సంవత్సరం ఆగస్టు 15న విడుదల చేసారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కి ఎంతగానో ఆదరణ లభించింది. న్యూయార్క్‌లో జరిగిన ఇంటర్నేషనల్ ‘ఒనిరోస్ ఫిల్మ్ అవార్డ్స్‌’లో రెండు అవార్డులు సొంతం చేసుకున్న ఈ షార్ట్ ఫిల్మ్ తాజాగా ఫ్రాన్స్‌లో జరగనున్న’టౌలౌజ్ షార్ట్స్ ఫెస్ట్‌’లో 8 అవార్డులకు ఎంపికైంది.

‘సత్య’ షార్ట్ ఫిల్మ్ బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ ఎడిటింగ్, బెస్ట్ సినిమాటోగ్రఫీ, బెస్ట్ ప్రొడ్యూసర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ ఇండీ పార్ట్ విభాగాల్లో అవార్డులు అందుకోనున్నారు. ఈ విషయాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై సాయిధరమ్ తేజ్ స్పందించారు. మంచి సినిమా ఎప్పుడూ నెంబర్ వన్ పొజిషన్ లో ఉంటుందని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement