Saturday, April 27, 2024

ఈ వీకెండ్ లో సంద‌డి చేయ‌డానికి రెడీగా 7 సినిమాలు.. థ్యాంక్యూపై పెరుగుతున్న అంచనాలు

కొవిడ్ త‌ర్వాత సినిమాలు, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో థియేట‌ర్లు క‌ళ‌క‌ళ‌లాడుతున్నాయి. ప్రతి వీకెండ్‌లో కొత్త సినిమాల రిలీజ్ ల‌తో థియేటర్లు ఎప్పుడూ సందడిగా ఉంటున్నాయి. కొన్ని సినిమాలకు తక్కువ బజ్ ఉంటే, మరికొన్ని పెద్ద హైప్‌తో థియేట‌ర్ల‌కు వస్తున్నాయి. అట్లా ప్ర‌తీ వీకెండ్ మాదిరిగానే ఈ శుక్రవారం కూడా రిలీజ్‌కు రెడీగా 7 సినిమాలు ఉన్నాయి. పోయిన‌ శుక్రవారం ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన రామ్ సినిమా ‘ది వారియర్’ తర్వాత సినీ ప్రియుల దృష్టి అంతా నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘థాంక్యూస మూవీపైనే ఉంది. దీనికి తక్కువ బజ్ ఉన్నప్పటికీ, చైతన్య, రాశి ఖన్నా, దర్శకుడు విక్రమ్ కుమార్, నిర్మాత దిల్ రాజు వంటి ఇండ‌స్ట్రీలో పెద్ద పేర్లున్న వ్య‌క్తులు తీయ‌డంతో ప్రేక్షకులలో ఆసక్తి ఉంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకుంటే.. బాక్స్ ఆఫిస్ ద‌గ్గ‌ర‌ క్యాష్ రిజిస్టర్‌లను మోగించడం ఖాయం.

‘థ్యాంక్యూ’ సినిమా కాకుండా రణబీర్ కపూర్ ‘షంషేరా’ కూడా జులై 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా.. స్వాతంత్ర్యానికి ముందు జరిగిన ఇన్సిడెంట్ల ఆధారంగా యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కింది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.. కానీ తెలుగు వెర్షన్‌కి పెద్దగా ప్రేక్షకులు రాకపోవచ్చు అనే అనుమానాలు సినీ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తున్నాయి. అదే రోజు యాంకర్ అనసూయ న‌టించిన‌ ‘దర్జా’ సినిమా కూడా రిలీజ్​కు సిద్ధింగా ఉంది.

ఈ మూడు సినిమాల‌తో పాటు అమ్మ రాజశేఖర్ ‘హాయ్ ఫైవ్​’ కూడా ఉంది.. ఇక.. ‘జగన్నాథకం’, ‘మీలో ఒకడు’. హ‌న్సిక న‌టించిన ‘మ‌హా’ ఈ వీకెండ్ లో థియేట‌ర్ల‌కి రాబోతున్నాయి. కొన్నాళ్ల క్రితం షూటింగ్ పూర్తి చేసుకున్న‌ హన్సిక సినిమాలో శింబు కూడా ఒక‌ ప్రత్యేక పాత్రలో న‌టించాడు. మొత్తం మీద ఈ వీకెండ్ లో రిలీజ్‌కు 7 సినిమాలు రెడీగా ఉన్నా.. వాటికి అంత‌గా బ‌జ్ క్రియేట్ కాలేదు. ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించాలంటే ‘థ్యాంక్యూ’ మినహా మిగిలిన అన్ని సినిమాలకు సూపర్ పాజిటివ్ టాక్ రావాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement