Friday, May 3, 2024

‘ఎఫ్3’ కథ ఇదేనంటూ పోస్టింగ్స్

దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న ఎష్3 చిత్రంపై అప్పుడే అంచనాలు పెరిగాయి. హీరో  వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌తో వచ్చిన ఎఫ్ 2కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఎఫ్ 3 సినిమాపై అప్పుడే అటు ఇండస్ట్రీ లో ఇటు ప్రేక్షక లోకంలో మంచి అంచనాలు నెలకొననున్నాయి. తాజాగా ఎఫ్ 3 కథ ఇదేనంటూ కొందరు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్స్ వైరల్ అవ్వడంతో ఈ సినిమా పట్ల క్రేజ్ ఇంకాస్త పెరగనుంది. అటు వరుస హిట్ల మీద దూసుకెళ్తున్న అనిల్ రావిపూడి కి కూడా బయట మంచి నేమ్ ఎలానో వుంది. తన హిట్టు ట్రాక్ తెలిసిన వాళ్ళందరూ ఈ సినిమా కూడా సూపర్ హిట్టు కొడుతుంది అంటూ అప్పుడే పాజిటివ్ గా ప్రచారం మొదలుపెడుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఎఫ్ 2లో నటించిన వెంకటేశ్ అండ్ వరుణ్ తేజ్, మెహ్రిన్, తమన్నా, రాజేంద్ర ప్రసాద్ వంటి నటీనటులు నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఆగస్టు 27న ధియేటర్లలో విడుదల కానుంది అంటూ మేకర్స్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement