Saturday, April 20, 2024

ముంబై టు చేవెళ్ల… సలార్ అప్డేట్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి రామగుండం లోని ఓపెన్ కాస్ట్ 2 లో జరిగింది. ఇక రెండో షెడ్యూల్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది. అందుకు సంబంధించి చేవెళ్ల మరియు శంషాబాద్ ప్రాంతాలలో మరో భారీ సెట్ వర్క్ జరుగుతున్నట్లుగా సమాచారం.

రెండో షెడ్యూల్ మొత్తం ఈ సెట్ లోనే జరగబోతుందట. మరోవైపు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లోనే ఉన్నాడు. ఈ షెడ్యూల్ ముగిశాక సలార్ సెట్ లో జాయిన్ కాబోతున్నాడట. ఇక ఈ రెండు సినిమాలతో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వం లో కూడా ప్రభాస్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement