Monday, April 29, 2024

ఇన్వెస్ట‌ర్ల నుంచి ఓలా 500 మిలియన్‌ డాలర్ల సేకరణ

బెంగళూరు : వచ్చే ఏడాది ఐపీవోకి రాబోతున్న ఓలా కంపెనీ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్ల నుంచి 500 మిలియన్‌ డాలర్ల రుణం సేకరించినట్టు తెలిపింది. రైడ్‌ – హెయిలింగ్‌ మార్కెట్‌లో ఓలాకు సింహభాగం వాటాతో ఉబర్‌ టెక్నాలజీస్‌తో పోటీ పడుతోంది. ఐపీవో ద్వారా 1 బిలియన్‌ డాలర్ల వరకు సేకరించాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.

ప్రతిపాదిత రుణ సేకరణకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన లభించిందని వివరించింది. మరోవైపు ఓలా విభాగం ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ బిజినెస్‌ను భవిష్యత్‌లో ప్రత్యేకంగా లిస్టింగ్‌కు తీసుకురావాలని కంపెనీ సీఈవో అగర్వాల్‌ భావిస్తున్నారు. ఓలా ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ విభాగం ప్రస్తుతం ఓలా స్కూటర్లను తయారుచేస్తోంది. డిసెంబర్‌ 15,2021 నుంచి స్కూటర్ల డెలివరీ కూడా మొదలైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement