Wednesday, May 15, 2024

Disney Plus Hotstar | పాస్వ‌ర్డ్ షేరింగ్ కి క‌ల్లెం.. మొద‌ట ఆ దేశంలోనే!

ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ పాస్‌వర్డ్ షేరింగ్‌ పాలసీని మార్చేసింది. ఒక కుటుంబానికి మాత్రమే పాస్‌వర్డ్ షేరింగ్ పరిమితమైంది. అంటే సబ్‌స్క్రైబర్లు నెట్‌ఫ్లిక్స్‌ అకౌంట్‌ను వారితో నివసించే కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు, కానీ విడిగా నివసించే స్నేహితులతో షేర్ చేసుకోలేరు. కాగా, ఇప్పుడు డిస్నీ + హాట్‌స్టార్‌ కూడా అదే బాటలో అడుగులు వేస్తోంది. ఈ మేరకు సర్వీస్ రూల్స్ అప్‌డేట్ చేస్తున్నట్లు మెంబర్‌షిప్ తీసుకున్న వారందరికీ ఈ-మెయిల్ కూడా పంపించింది.

ఈ మార్పు ప్రభావం మొదటగా కెనడా ప్రజలపై పడే అవకాశం ఉంది. దీంతో నవంబర్ 1 నుంచి కెనడియన్ సబ్‌స్క్రైబర్లు హౌజ్‌హోల్డ్ మెంబర్స్‌తో తప్ప ఇతరులతో పాస్‌వర్డ్ షేర్ చేసుకోకుండా రిస్ట్రిక్షన్స్ తీసుకొస్తున్నామని అందులో స్పష్టం చేసింది. అయితే, అకౌంట్ షేరింగ్ విషయంలో భారతీయ యూజర్లపై ఇప్పటికిప్పుడే ప్రభావం పడకపోవచ్చు. అయితే, ఓటీటీ సంస్థలు రెవెన్యూ పెంచుకోవడానికి అకౌంట్ షేరింగ్‌కు అడ్డుకట్ట వేస్తున్నాయి.

దీంతో భవిష్యత్తులో మిగతా ఓటీటీ సంస్థలు కూడా ఇదే ట్రెండ్ ఫాలో కావచ్చు. కొత్త పాలసీ ప్రకారం, డిస్నీ + హాట్‌స్టార్‌ ఒక ప్రీమియం అకౌంట్‌ను ఏ డివైజ్‌లు ఉపయోగిస్తున్నాయో, అవి ఎక్కడ ఉన్నాయో మానిటర్ చేస్తుంది. అకౌంట్‌ వేర్వేరు స్థానాల్లోని డివైజ్‌లలో ఉపయోగిస్తున్నారని కనుగొంటే, సబ్‌స్క్రైబర్‌ తనతో పాటు నివసించని వ్యక్తులతో పాస్‌వర్డ్‌ను షేర్ చేస్తున్నారని కంపెనీ భావించవచ్చు.

- Advertisement -

పాస్‌వర్డ్‌ను షేర్ చేస్తున్నారని నిర్ధారణ అయ్యాక, షేరింగ్ ఆపివేయమని హెచ్చరించవచ్చు. వీటిని పట్టించుకోకుండా పాస్‌వర్డ్‌ను షేర్ చేయడాన్ని కొనసాగిస్తే, కంపెనీ అకౌంట్‌పై పరిమితులు విధించే అవకాశం ఉంది. తద్వారా నిర్దిష్ట సంఖ్యలో డివైజ్‌లు మాత్రమే ఒకేసారి అకౌంట్ యాక్సెస్ చేయగలుగుతాయి. లేదా కంపెనీ అకౌంట్‌ను పూర్తిగా రద్దు చేయవచ్చు. ఈ మార్పులు 2023, నవంబర్ 1 లేదా నెక్స్ట్ బిల్లింగ్ డేట్ నుంచి కెనడాలో అమల్లోకి వస్తాయని కంపెనీ ఈమెయిల్ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement