Thursday, April 25, 2024

మిలియనీర్ల నగరాల్లో న్యూయార్క్‌ టాప్‌.. ముంబై @ 25..

ప్రపంచంలో అత్యంత సంపన్న నగరంగా న్యూయార్క్‌ టాప్‌ ర్యాంక్‌ దక్కించుకుంది. అత్యధిక మంది బిలియనీర్లు ఇక్కడ నివాసితులుగా ఉన్నారు. దుబాయ్‌, ముంబై, షెన్‌జెన్‌ నగరాలు భవిష్యత్‌ సంపన్న నగరాల జాబితాలోకి చేరనున్నాయని ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వయిజరీ సంస్థ హెన్లే అండ్‌ పార్ట్‌నర్స్‌ తాజా నివేదికలో పేర్కొంది. 2022 సంవత్సరంలో అత్యధిక ధనిక నగరాల జాబితాలో అమెరికా ఆధిపత్యం చెలాయించింది. 3, 45,000 మంది మిలియనీర్లతో న్యూయార్క్‌ మొదటి స్థానంలో ఉంది. 3,04,900 మంది మిలియనీర్లతో టోక్యో రెండవ స్థానంలోకి ప్రవేశించింది. చాలా కాలంగా, ధనిక నగరం కిరీటాన్ని మోస్తున్న లండన్‌ ఇప్పుడు నాలుగో స్థానానికి పడిపోయింది. 2,76,400 మంది మిలియనీర్లున్న శాన్‌ఫ్రాన్సిస్కో కంటే వెనుకబడింది. అమెరికాకే చెందిన శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్‌ఏంజెల్స్‌, చికాగో, హోస్టన్‌, డల్లాస్‌ సిటీలు టాప్‌-10లో చోటుదక్కించుకున్నాయి. ప్రైవేట్‌ సంపద, పెట్టుబడి వలస పోకడలను ట్రాక్‌ చేసే హెన్లి గ్లోబల్‌ సిటిజన్స్‌ రిపోర్ట్‌ ప్రకారం…

  • భారతదేశ ఆర్థిక రాజధాని ముంబై 25వ స్థానం దక్కించుకుంది. ఇక్కడ 60,600 మంది మిలియనీర్లు, 243 మంది సెంటిలియనీర్లు, 30 మంది బిలియనీర్లు ఉన్నారు. ఇండియా సిలికాన్‌ వ్యాలీగా ప్రసిద్ధి చెందిన బెంగళూరు కూడా మిలియనీర్లను ఆకర్షిస్తోంది.
  • ఐదవ ర్యాంకు పొందిన సింగపూర్‌, ఆసియాలోనే అతిపెద్ద ధనిక నగరం రికార్డును సొంతం చేసుకుంది. ఇక్కడ
    249,800 మంది మిలియనీర్లుడంగా, వీరిలో 336 సెంటీ-మిలియనీర్లు, 26 మంది బిలియనీర్లు ఉన్నారు. ఏడాది చివరికి వలస వచ్చిన సంపన్నుల సంఖ్య 2,800కి చేరొచ్చని అంచనా.
  • చైనా నగరాలు బీజింగ్‌ (9), షాంఘై (10) స్థానాల్లో నిలిచాయి. స్విట్జర్లాండ్‌, ఆస్ట్రేలియా టాప్‌-20లో చోటు దక్కించుకున్నాయి. జురిచ్‌ (11) సిడ్నీ (15), మెల్‌బోర్న్‌(17), జెనీవా (19) ర్యాంకులు పొందాయి.
  • ఎమిరేట్స్ హాల్స్‌, జుమేరా గోల్ఫ్‌ ఎస్టేట్‌స పామ్‌ జుమేరా దుబాయ్‌లో ఎక్కువ మంది కోరుకునే సంపన్న గమ్యస్థానాలు.
  • టాప్‌ 20 ధనిక నగరాల్లో 14 గోల్డెన్‌ వీసాను అందించే దేశాలు కావడం విశేషం. మరొక దేశంలో శాశ్వత నివాసాన్ని పొందేందుకు గోల్డ్‌ వీసాలు దోహదం చేస్తాయి. సంపన్న భారతీయుల ఎంపికలో గోల్డెన్‌ వీసాలకు ప్రాముఖ్యత పెరిగింది.
  • భారతదేశంలో కనీసం 8,000 మంది హెచ్‌ఎన్‌ఐలు దేశం విడిచి వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ నివేదికల ప్రకారం, 900,000 మంది భారతీయులు 2015-2021 మధ్య తమ పాస్‌పోర్ట్‌లను సరెండర్‌ చేశారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement