Saturday, May 11, 2024

బజాజ్‌ ట్రయంఫ్‌ నుంచి కొత్త బైక్‌లు.. స్పీడ్‌ ధర 2.33 లక్షలు

దేశీయ ఆటోమొబౖౖెల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో, బ్రిటిష్‌ మోటార్‌ సైకిల్‌ బ్రాండ్‌ ట్రయంఫ్‌తో కలిసి డెవలప్‌ చేసిన రెండు కొత్త బైక్‌లను మన దేశ మార్కెట్‌లో విడుదల చేసింది. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400, స్క్రాంబ్ల ర్‌400 ఎక్స్‌ పేరుతో ఈ రెండు బైక్‌లను మార్కెట్‌లో విడుదల చేసింది. లండన్‌లో గత వారం వీటిని మార్కెట్‌లో విడుదల చేశారు. ట్రయంఫ్‌ స్పీడ్‌ 400 ధర 2.33 లక్షలుగా నిర్ణయించారు. అయితే ఈ ధర తొలి 10వేల కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. స్క్రాంబ్లర్‌ 400ఎక్స్‌ ధరను మాత్రం కంపెనీ ప్రకటించలేదు. స్పీడ్‌ 400 బైక్‌ను ఈ నెల నుంచే అమ్మకాలు ప్రారంభిస్తారు. స్క్రాంబ్లర్‌ 400 ఎక్స్‌ బైక్‌ను మాత్రం అక్టోబర్‌ నుంచి అమ్మకాలు ప్రారంభించనున్నట్లు బజాజ్‌, ట్రయంఫ్‌ తెలిపాయి.

- Advertisement -

ఈ రెండు కొత్త బైక్‌లు 398 సీసీ ఇంజిన్‌తో వస్తున్నాయి. లిక్విడ్‌కూల్డ్‌, డ్యూయల్‌ ఓవర్‌ హెడ్‌ క్యామ్‌షాప్ట్‌ సింగిల్‌ సిలిండర్‌తో వస్తున్న ఈ ఇంజిన్‌, 40 పీఎస్‌ పవర్‌ను, 39.5 నానోమీటర్‌ పీక్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. వీటిలో 6 స్పీడ్‌ గేర్‌ బాక్స్‌ను అమర్చారు. లీటర్‌కు 28 కిలోమీటర్ల మైలేజీ వస్తుందని కంపెనీ తెలిపింది. డ్యూయల్‌ ఛానెల్‌ ఏబీఎస్‌, ఎల్‌ఈడీ లైటింగ్‌ వంటివి ఈ బైక్స్‌లో ఉన్నాయి. ఈ బైక్‌లు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైక్‌లకు గట్టి పోటీ ఇవ్వగలవని భావిస్తున్నారు. ఇండియాలో ట్రయంఫ్‌ బిజినెస్‌ను బజాజ్‌ ఆటో తీసుకుంది. ఈ రెండు కంపెనీల మధ్య ఒప్పందం మేరకు ఇండియాలో ఈ బైక్‌లు బజాజ్‌ ట్రయంఫ్‌గా వస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement