Friday, May 10, 2024

చానల్‌ గ్రూప్‌ గ్లోబల్‌ సీఈవోగా లీనా నాయర్‌..

లండన్‌ : గ్లోబల్‌ దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ట్విట్టర్‌ సీఈవోగా పరాగ్‌ అగర్వాల్‌ నియతులై రోజులు గడవక ముందే మరో వ్యక్తి అత్యున్నత శిఖరాన్ని అధిరోహిం చారు. లండన్‌లో నివసిస్తున్న బ్రిటీష్‌ ఇండియన్‌ మహిళ లీనా నాయర్‌.. గ్లోబల్‌ దిగ్గజం, ఫ్రెంచ్‌ లగ్జరీ గ్రూప్‌ ఛానెల్‌కి గ్లోబల్‌ సీఈవోగా నియమితులయ్యారు. ఆంగ్లో-డచ్‌ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం యూనిలీవర్‌ లీడర్‌షిప్‌ ఎగ్జిక్యూ టివ్‌(యూఎల్‌ఈ) వ్యాపార, ఆర్థిక ప్రదర్శన వ్యవహారాలను నిర్వహిస్తున్న ఆమె బాధ్యతల నుంచి వైదొలిగారు. ఛానెల్‌లో చేరడమే తరువాయి.

జనవరి 2022లో యూనిలీవర్‌ను లీనా నాయర్‌ వీడనున్నారని ఒక ప్రకటనలో యూనిలీవర్‌ పేర్కొంది. రిపోర్టుల ప్రకారం.. లండన్‌ కేంద్రంగా ఛానెల్‌ సీఈవోగా లీనా నాయర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. గత దశాబ్దాల కుపైగా కంపెనీకి తోడ్పాటు అందిస్తున్న లీనా నాయర్‌కు ధన్యవాదాలు తెలుపు తున్నానని యూనిలీవర్‌ సీఈవో అలెన్‌ జోప్‌ అన్నారు. లీనా నాయర్‌ మొదటి నుంచి యూనిలీవర్‌తోనే కొనసాగారు. కానీ ఇక కొనసాగరు. యూనిలీవర్‌కు కొత్త నాయకత్వం రాబోతోందని అలెన్‌ జోప్‌ వివరించారు. లీనా నాయర్‌ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జెంషెడ్‌పూర్‌ పూర్వవిద్యార్థిని. ఇండియన్‌ యూనిలీవర్‌ అను బంధ సంస్థలో 1992లో చేరారు. దాదాపు 30 ఏళ్లపాటు అక్కడే పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement