Friday, May 3, 2024

ఈనెల 28న జీఎస్టీ మండలి సమావేశం.. వ్యాక్పిన్‌లపై పన్ను తగ్గిస్తారా?

కరోనా వ్యాక్పిన్‌లపై పన్ను అంశమే అజెండాగా ఈనెల 28న జీఎస్‌టీ మండలి సమావేశం కానుంది. టీకాలపై పన్నుతో పాటు ప్రాసెస్డ్‌ ఆహారం, మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌, మెడికల్‌ గ్రేడ్‌ పరికరాలపై జీఎస్‌టీ తగ్గింపు అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వ్యాక్సిన్లపై 5శాతం, కొవిడ్ ఔషధాలు, ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లపై 12శాతం జీఎస్‌టీ విధిస్తున్నారు.

కరోనా టీకాలపై జీఎస్‌టీని తొలగించాలని ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌, పంజాబ్‌, ఒడిశా తదితర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. అయితే జీఎస్‌టీ మాఫీ చేస్తే వ్యాక్సిన్‌ ధరలు పెరుగుతాయని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల తెలిపారు. జీఎస్‌టీ నుంచి పూర్తిగా మినహాయింపు కల్పిస్తే.. దేశీయ తయారీదారులు ముడిపదార్ధాలు, సేవలకు చెల్లించిన పన్నులను తిరిగి రాబట్టుకోలేక అంతిమంగా వాటి ధరలు పెంచుతారని, తద్వారా వినియోగదారులపై భారం పడుతుందని ఆమె వివరించారు. అయితే పూర్తిగా మినహాయింపు ఇవ్వకుండా వ్యాక్సిన్లను సున్నా శ్లాబులో చేరొచ్చని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. 0.1 శాతం కనీస పన్ను విధిస్తే.. తయారీదారులు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌లను రీఫండ్‌ చేసుకునే వీలుంటుందని చెప్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement