Sunday, April 28, 2024

ట్విటర్‌కు ఆర్థిక ఇబ్బందులు.. సగానికి పడిపోయిన ఆదాయం

ఎలాన్‌మస్క్‌ సారథ్యంలో ట్విటర్‌ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతోంది. ప్రస్తుతం నగదు కొరత తీవ్రంగా ఉందని స్వయంగా ఎలాన్‌ మస్క్‌ ఆదివారం పేర్కొన్నారు. ముఖ్యంగా వాణిజ్య ప్రకటనల ఆదాయం సగానికి పడిపోవడం, భారీగా రుణాలు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని వివరించారు. ప్రస్తుతం మస్క్‌ కంపెనీ సీటీవోగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అన్నిటికంటే ముందు నగదు నిల్వల ఏర్పాటు చేసుకొనే స్థితికి ట్విటర్‌ చేరుకోవాలన్నారు. ఓ వినియోగదారుడు మస్క్‌ను ట్విటర్‌లో పెట్టుబడుల పునర్‌ వ్యవస్థీకరణపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు.

- Advertisement -

వాస్తవానికి ఈ ఏడాది 4.5 బిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని అంచనావేశారు. కానీ, తర్వాత ఆ అంచనాలను కూడా 3 బిలియన్‌ డాలర్లకు కుదించారు. 2021లో 5.1 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ. మస్క్‌ ట్విటర్‌ ఆధీనంలోకి తీసుకొన్నప్పటి నుంచి వ్యయనియంత్రణ చర్యలు చేపట్టారు. కానీ, అవేవీ ఇప్పటి వరకు సత్ఫలితాలిస్తున్నట్లు కనిపించడంలేదు. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించారు. మస్క్‌ ఆశించిన స్థాయిలో ట్విటర్‌ ఆదాయం పెరగలేదు

Advertisement

తాజా వార్తలు

Advertisement