Saturday, April 27, 2024

క్రెడిట్‌ కార్టు వ్యయాలు 1.4 లక్షల కోట్లు.. మే నెలపై ఆర్బీఐ నివేదిక

దేశంలో క్రమంగా క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరుగుతున్నది. మే నెలలో మన దేశంలో క్రెడిట్‌ కార్డు వినియోగదారులు చేసిన వ్యయాలు 1.4 లక్షల కోట్లుకు చేరినట్లు ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత ఆర్ధిక సంవత్సరంలో ఏ నెలలో కూడా క్రెడిట్‌ కార్డుల వినియోగం 1.10 నుంచి 1.20 లక్షల కోట్లు దాటలేదు.

2023లో క్రెడిట్‌ కార్డుల వినియోగం భారీగా పెరుగుతున్నది. ప్రస్తుతం మొత్తం క్రెడిట్‌ కార్డుల సంఖ్య 8.74 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే కొత్తగా 20 లక్షల క్రెడిట్‌ కార్డులు వచ్చాయని తెలిపింది. ఒక్కోక్క క్రెడిట్‌ కార్డుపై వ్యయం 16,44 రూపాయలకు చేరింది.

- Advertisement -

అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కార్డులు 1.81 కోట్లు ఉన్నాయి. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులు 1.71 కోట్లు, ఐసీఐసీఐ బ్యాంక్‌ కార్డులు 1.47 కోట్లు, యాక్సిస్‌ బ్యాంక్‌ కార్డులు 1.25 కోట్లు ఉన్నాయి. దేశంలో క్రెడిట్‌ కార్డుల వినియోగం పెరగడంతో పాటు, మొండి బకాయిలు కూడా పెరుగుతున్నాయని క్రెడిట్‌ సమాచార కంపెనీ ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ తన నివేదికతో తెలిపింది.

మొండి బకాయిలు…

ఏడాది వ్యవధిలో మొండి బకాయిలు 0.66 శాతం పెరిగాయి. 2022 మార్చితో పోలిస్తే క్రెటిట్‌ కార్డుల మొండి బకాయిలు ఈ ఏదాడి మార్చి చివరి నాటికి 0.66 శాతం పెరిగి 2.94 శాతానికి చేరాయని సిబిల్‌ తెలిపింది. హామీ లేని రుణాలు ఇవ్వడం పట్ల ఆర్బీఐ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.

వ్యక్తిగత రుణాల్లో నిరర్ధక ఆస్తులు 0.04 శాతానికి పరిమితమయ్యాయి. క్రెడిట్‌ కార్డుల వ్యయాలు 2022-23లో 34 శాతం పెరిగాయి. వ్యక్తిగత రుణాలు 29 శాతం పెరిగాయి. ఆస్తులపై ఇచ్చే రుణాలు అత్యంత వేగంగా పెరుగుతున్న రిటైల్‌ ఉత్పత్తిగా ఉంది.

ఈ విభాగంలో 38 శాతం వృద్ధి నమోదైంది. రిటైల్‌ రుణాల్లో కీలకంగా ఉన్న గృహ రుణాలు మాత్రం అన్నింటికంటే తక్కువగా 14 శాతం మాత్రమే పెరిగాయి. వడ్డీ రేట్లు పెరడంతో దాని ప్రభావం ఈ రుణాలపై పడింది. రుణాలు తీసుకుంటున్న వారిలో యువత ఎక్కువగా ఉంటోంది. 20023 జనవరి- మార్చిలో రుణాలు తీసుకున్న వారిలో 31-45 సంవత్సరాల వయస్సున్న వారు 45 శాతంగా ఉన్నారని ఆర్బీఐ నివేదిక తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement