Wednesday, October 23, 2024

ఎయిర్‌ ఆసియా కొనుగోలుకు ఎయిర్‌ ఇండియాకు అనుమతి..

ఎయిర్‌ ఆసియా ఇండియాను టాటా గ్రూప్‌ ఆధీనంలోని ఎయిర్‌ ఇండియా కొనుగోలు చేసేందుకు అనుమతి లభించింది. గతంలోనే టాటా సన్స్‌ ఈ డీల్‌ ఆమోదం కోసం యాంటీ ట్రస్ట్‌ రెగ్యులేటర్‌ అయిన కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ)ని సంప్రదించారు. ఎయిర్‌ ఆసియా ఇండియా టాటా గ్రూప్‌లోని సంస్థ. ఇందులో టాటా గ్రూప్‌కు 83.67 శాతం వాటా ఉంది. ఎయిర్‌ ఆసియాలో ఉన్న మొత్తం ఈక్వీటి షేర్లను ఎయిర్‌ ఇండయా కొనుగోలు చేసేందుకు సీసీఐ మంగళవారం నాడు అనుమతి ఇచ్చింది.

ఎయిర్‌ ఇండియాకు, ఎయిర్‌ ఆసియాకు దేశీయ విమానయాన రంగంలో 15.7 శాతం వాటా కలిగి ఉన్నాయి. డిసెంబర్‌ 2020 నాటికి టాటా సన్స్‌కు ఎయిర్‌ ఆసియాలో 83.67 శాతం కలిగి ఉన్నారు. మిగిలి ఉన్న వాటాను కూడా మలేషియాకు చెందిన ఎయిర్‌ ఆసియా బెర్హాడ్‌ నుంచి కొనుగోలు చేయనుంది. టాటా ఆధ్వర్యంలో ఉన్న ఎయిర్‌ ఇండియా, ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌, విస్తారా, ఎయిర్‌ ఆసియా ఇక నుంచి ఒకే సంస్థగా మారనున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement