Tuesday, December 3, 2024

AP | డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు : సీఎం చంద్రబాబు

కర్నూలు బ్యూరో, (ఆంధ్రప్రభ) : ఓర్వకల్లు మండలంలో డ్రోన్ హబ్ కోసం 300 ఎకరాలు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అమరావతి డ్రోన్ సమ్మిట్ లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఓర్వకల్లు ప్రాంతం డ్రోన్ తయారీకి హబ్ గా మారనుందన్నారు.

హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అమరావతి వంటి ప్రధాన నగరాలకు ఈ ప్రాంతం సమాన దూరంలో ఉంటుందని చెప్పారు. త్వరలో ఇక్కడ శిక్షణ, తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 300 ఎకరాల భూమిని కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement