Saturday, September 21, 2024

దేశం నుంచి 100 బిలియన్‌ డాలర్లు తరలిపోవచ్చు.. ఆర్బీఐ అంచనా

అంతర్జాతీయ పరిస్థితులు, ద్రవ్యోల్బణం పెరుగుదల, అమెరికా వడ్డీ రేట్లు పెంచడం , చమురు ధరల పెరుగుదల వంటి అనేక ప్రతికూల పరిస్థితుల్లో మన స్టాక్‌ మార్కెట్ల నుంచి విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. గత 8 నెలలుగా మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 100 బిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు తరలిపోవచ్చని అర్బీఐ ప్రచురించిన ఒక వ్యాసంలో అంచనా వేశారు. ప్రస్తుతం మన దేశంలో విదేశీ మారకపు నిల్వలు 596 బిలియన్‌ డాలర్ల వరకు ఉన్నాయని తెలిపింది.

మొత్తం పోర్టుఫోలియో ఇన్వెస్టుమెంట్స్‌లో ఇలా తరలిపోయి పెట్టుబడులు 5 శాతం వరకు ఉంటాయి. విదేశీ మారకపు నిల్వలు గత సంవత్సరం సె ప్టెంబర్‌లో రికార్డ్‌ స్థాయిలో 642 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2022లో ఇప్పటి వరకు విదేశీ ఇన్వెస్టర్లు 2.08 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తరలించుకుపోయారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement