Monday, June 17, 2024

AP | అవన్నీ అబద్ధాలు.. ఆ వార్తలను నమ్మొద్దు

ఏపీ సచివాలయాన్ని ప్ర‌భుత్వం తాకట్టు పెట్టింద‌టూ వస్తున్న వార్తలపై వైసీపీ స్పందించింది. సచివాలయాన్ని రూ.370 కోట్లకు బ్యాంకుకు కట్టబెట్టారని ఓ ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైంది. దీనిపై వైసీపీ స్పందిస్తూ.. సచివాలయంపై ఎల్లో మీడియా అవాస్తవాలు రాస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని.. జగన్ ప్రభుత్వం నిబంధనల ప్రకారం వ్యవహరిస్తున్నా ఎల్లో మీడియా మాత్రం విషం చిమ్ముతుంద‌ని తెలిపింది. ఇది కేవలం ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మాత్రమే అని వెల్ల‌డించింది. ఈ తప్పుడు కథనంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసినట్లు పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement