Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వేళ ఉత్త‌రాంధ్ర వైసిపి జోష్

విశాఖపట్నం,ఆంధ్రప్రభబ్యూరో: విశాఖను పరిపాలన రాజధానిగా ప్రకటించిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రెండు రోజుల పాటు గ్లోబల్‌ ఇన్విస్టెమెంట్‌ను అత్యం త ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల మైదానం వేదికగా జరిగిన ఈ సమ్మిట్‌ పూర్తిస్థాయి లో విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం కనీస పెట్టుబడులు రూ.2 లక్షల కోట్లుగా ప్రకటించినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపా ర దిగ్గజాలను రప్పించి భారీగా వారితో పెట్టుబడులు పెట్టిం చారు. ఏకంగా 13.41 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగింది. ముకేష్‌ అంబానీతో పాటు, కరణ్‌ ఆదాని వంటి ఎంతో ప్రముఖ వ్యాపార వేత్తలు, పారిశ్రామిక రంగాల్లో ఆరితేరిన వారు ఈ సదస్సులో పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం కీర్తిని ఇనుమడింపజేసే విధంగా చేశారు. ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ వల్ల ఈ సమ్మిట్‌ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. రాష్ట్ర మంత్రులు గుడివాడ అమర్‌నా థ్‌, బుగ్గన రాజేంద్రనాథ్‌లు స్వయంగా అనేక ప్రాంతాల్లో పర్యటించి పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి అహోరాత్రులు సదస్సు విజయవంతానికి తమ శక్తివంచన లేకుండా కృషి చేశారు. విశాఖ వేదికగా జరిగిన సమ్మిట్‌ విజయవంతం కావడంతో ఉత్తరాంధ్ర వైసీపీ వర్గాలు పుల్‌ జోష్‌లో ఉండగా అంతకు మించి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి సైతం ఎన లేని ఆత్మవిశ్వాసం, సంతోషం కలిగించిందని సభా ముఖంగా ప్రకటించారు.


అధికార పార్టీకి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రతిష్టాత్మకం
అధికార పార్టీకి ఇప్పుడు తాజాగా ఉత్తరాంధ్రలో జరగను న్న పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక అత్యంత కీలకం కానుంది. ఈ ఎన్నికలో వైసీపీ తప్పనిసరిగా విజయం సాధిం చాల్సి ఉంది. ఒక మాటలో చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికను సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండంగా పోలుస్తున్నా యి. విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించిన తరువా త ఈ శాసనమండలి ఎన్నిక ఈనెల 13న జరగనుంది. అందులోనూ పట్టభద్రులు ఓటింగ్‌ చేయాల్సి ఉండడంతో ఇది మరింత కీలక ంగా మారింది. కాబట్టి ఈ ఎన్నికలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్‌ (బ్రాహ్మణ సామా జిక వర్గం) విజయం సాధిస్తే ఇక అధికార పార్టీకి ఉత్తరాంధ్రలో తిరుగు లేదన్నట్లు ఆ పార్టీ వర్గాలు ప్రచారం చేసుకోవచ్చు.
అలా కాకుండా ప్రతిపక్షాలకు అవకా శం కల్పిస్తే పట్టభద్రుల్లో వ్యతిరేకత నెల కొంది కాబట్టి విశాఖలో పరిపాలనా రాజధాని ని ఎవరూ కోరుకోవడం లేదని ప్రతిపక్షాలు ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు అవుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే అధికార పక్షం నేతలు వైవీసుబ్బారెడ్డి, మంత్రులు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌, ధర్మాన ప్రసాదరావు, బోత్స సత్యనారాయణ, వైసీపీ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్‌బాబులతో పాటు హేమాహేమీలు, శాసనమండలి సభ్యు లు, ఎమ్మెల్యేలు, మేయర్‌, జెడ్‌పి చైర్‌ పర్సన్‌తో పాటు అందరూ ఎమ్మెల్సీ అభ్యర్ధిని గెలిపించు కోవడానికి అహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఎమ్మె ల్సీ అభ్యర్ధి సీతంరాజు సుధాకర్‌ కూడా గత కొద్ది నెలలు గా ఉత్తరాంధ్రలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీ నేతలు మద్దతుతో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

విప‌క్షాలు స్ర్టాంగ్
ఉత్తరాంధ్ర పట్టబద్రుల శాసనమండలి ఎన్నికల్లో గెలవ డం అంత వీజీ కాదన్నది అందరికి తెలిసిన విషయమే. అయితే అందుకు కారణం లేకపోలేదు. ప్రధానంగా ఓటర్లం తా పట్టభద్రులే కావడం వల్ల ఆచి, తూచి ఓటు వేయడానికి అవకాశం కలుగుతుంది. ఈ నేపధ్యంలోనే తెలుగుదేశం పార్టీ విద్యావేత్తగా పేరుగాంచిన వేపాడ చిరంజీవిరావు(బీసీ తూర్పుకాపు)ను బరిలోకి దింపింది. ఆ పార్టీ నేతలు తమ అభ్యర్ధి గెలుపు కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు భాజాపా సిట్టింగ్‌ ఎమ్మెల్సీ మాధవ్‌(వెలమ సామాజిక వర్గం)నే మరోసారి బరిలోకి దింపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ భాజాపా రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలందించిన దివంగత నేత పి.వి.చలపతిరావు కుమారిడిగా మాదవ్‌కు మంచి పరిచయాలు ఉన్నాయి. మరో వైపు భాజాపా నేతలు మాధవ్‌ను గెలిపించుకోవడానికి శక్తివంచన లేకుండా ప్రయ త్నాలు చేస్తున్నారు. కేంద్రం అందిస్తున్న అన్ని పథకాలు, ప్రాజెక్టులు రాష్ట్రం నుంచి సమన్వయం చేసేందుకు మాధవ్‌ కు మరోసారి అవకాశం కల్పించాలని తాజాగా కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సైతం భాజాపా నుంచి ప్రచారం చేస్తున్నారు. ఇక ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కూడా విశాఖలో మకాం వేసి ఎన్నికలు పూర్తయ్యే వరకు మాధవ్‌కు ప్రచారం చేయనున్నారు. ఇక రెండుసార్లు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో విజయం చేజిక్కించుకున్న పీడీఎఫ్‌ కూడా మరో సారి తమ అభ్యర్ధిని గెలిపించుకునే ప్రయత్నాల్లో ముమ్మరం గా ప్రచారం చేస్తున్నాయి. పీడీఎఫ్‌ అభ్యర్ధిగా కోరెడ్ల రమా ప్రభ బరిలో ఉన్నారు. రమాప్రభ భర్త గంగారావు యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు కాగా ఆమె వెలమ సామాజిక వర్గానికి చెందినవారు. దీంతో పాటు పీడీఎఫ్‌కు ఉత్తరాంధ్రలో బలమైన ఓటుబ్యాంకు కలిగి ఉంది. గతంలో రెండుసార్లు పీడీఎఫ్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగిన ఎంవిఎస్‌ శర్మ విజయం సాధించారు. గత ఎన్నిక ల్లో పీడీఎఫ్‌ అభ్యర్ధిగా బరిలోకి దిగిన అజశర్మ స్వల్ప ఓట్ల తేడా తో ఓటమి చెందారు. అయితే తేదేపా మద్దతు పలకడంతో భాజాపా అభ్యర్ధి మాధవ్‌ సునాయాసంగా ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. కాని ఇప్పు డు అన్ని పార్టీల అభ్యర్ధులు బలమైన వారే. ఎవరికి వారే తమదే విజయం అన్న దీమాలో ఉన్నా రు. అధికార పార్టీకి స్టీల్‌ప్లాం ట్‌ ప్రయివేటీకరణ, ఉపాధ్యాయ వర్గాల్లో నెలకొన్న అసమ్మతి , ఉద్యోగ వర్గాలు మద్దతు వంటి అంశాల్లో కొంత ప్రతికూలత ఉన్నప్పటికి వాటిని సునాయా సంగా అధిగమిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వాటినే తమ ప్రచార అస్త్రాలుగా ఎంచుకొని విపక్ష పార్టీల అభ్యర్ధులు ముమ్మర ప్రచారం సాగిస్తున్నారు. ఏది ఏమైనా ఈనెల 13న జరగనున్న పట్టభద్రుల శాసనమండలి (ఎమ్మె ల్సీ) ఎన్నిక అధికార పక్షానికి అత్యంత కీలకంగా మారింది. విపక్షాలు ఎలగైనా ఈ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ముమ్మ ర ప్రయత్నాలు చేస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement