Saturday, April 20, 2024

AP | విద్యార్థిని బలవన్మరణం.. కేసు ఛేదించిన పోలీసులు, ఐదుగురి అరెస్ట్

విశాఖపట్నంలో లైంగిక వేధింపులు భరించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న కేసును పోలీసులు ఛేదించారు. విద్యార్థిని ఆత్మహత్య కేసులో (మంగళవారం) ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. భాను ప్రవీణ్, ఉషారాణి, శంకర్ వర్మ, ప్రదీప్ కుమార్, శంకర్ రావులను అరెస్టు చేశారు. కెమిస్ట్రీ ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ రావు వేధింపుల వల్లే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

విద్యార్థినులతో పాటు అధ్యాపకులు తనను లైంగికంగా వేధిస్తున్నారని.. అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారని.. కుటుంబం పరువు పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నా సారీ నాన్న అంటూ…. మెసేజ్ పంపి ఓ పాలిటెక్నిక్ కాలేజీ విద్యార్థిని కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కుమార్తె ఆత్మహత్య గురించి చెప్పకుండా కాలేజీ యాజమాన్యం ఆమె కనిపించకుండా పోయిందని సమాచారం ఇచ్చిందని విద్యార్థి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని కుటుంబసభ్యులు, బంధువులు పోలీసులను డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement