Friday, May 3, 2024

ఇంగ్లీష్‌ బోధనపై యూపీ ఆసక్తి.. మూడు రోజులపాటు ఏపీలో పర్యటించనున్న ఆ రాష్ట్ర బృందం..

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో అమలవుతున్న ఇంగ్లీష్‌ మీడియం విధి విధానాలు అధ్యయనం చేసేందుకు ఉత్తరప్రదేశ్‌ నుంచి బృందం 3 రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డా. బి. ప్రతాప్‌ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగలోని ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ టీ-చింగ్‌ ఇన్స్టిట్యూట్‌ ప్రిన్సిపాల్‌ శుక్ల, కుల్దీప్‌ పాండే మొదటి రోజు పెనమలూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, ఈడుపుగల్లు ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, నిడమానూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలను సందర్శించారని తెలిపారు.

విద్యార్థుల ఉచ్చారణ, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు అనుసరిస్తున్న ఇంగ్లీష్‌ మీడియం బోధన విధానాలు, ద్వి భాషా పుస్తకాలు, వృత్యంతర శిక్షణా కార్యక్రమాలను పరిశీలించారని పేర్కొన్నారు. ఇంగ్లీష్‌ మీడియం బోధనలో మెళకువలను అడిగి తెలుసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డా. స్కంద్‌ శుక్లా ప్రిన్సిపాల్‌, ఎస్సీఈఆర్టీ లెక్చరర్‌ సరికొండ సతీష్‌, హెచ్‌ఎంలు దుర్గాభవాని, సురేష్‌, పద్మ బాయి, ఎంఈవో కనక మహాలక్ష్మి పాల్గొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement