Wednesday, June 19, 2024

AP: కాకినాడలో జంట హ‌త్య‌లు…

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు శివారు లక్ష్మీపురం పంటపొలాల్లో బుధవారం ఉదయం జంటహత్యలు కలకలం రేపాయి. పోలీసుల కథనం ప్రకారం.. చేబ్రోలుకు చెందిన పోసిన శ్రీను(45), పెండ్యాల లోవమ్మ(35)ను అదే గ్రామానికి చెందిన లోక నాగబాబు కత్తితో నరికి విచక్షణారహితంగా హత్య చేశాడు. అనంతరం లోవమ్మ తల్లి రామలక్ష్మిపై కత్తితో దాడి చేశాడు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో పిఠాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

గత కొంతకాలంగా తనతో సహజీవనం చేస్తున్న లోవమ్మ.. ఇటీవల పోసిన శ్రీనుతో సహజీవనం చేస్తుందనే అనుమానంతో నాగబాబు ఈ హత్యలకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలిని పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. పోసిన శ్రీనుకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. భర్తతో విభేదాల కారణంగా లోవమ్మ ఆయనకు దూరంగా ఉంటోంది. ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement