Friday, May 3, 2024

AP: ఈనెల 8నుంచి రైళ్ల రాకపోకలు నిలిపివేత

శ్రీ సత్య సాయి బ్యూరో, డిసెంబర్ 1(ప్రభ న్యూస్) : కొత్తచెరువు ప్రశాంతి రైల్వే స్టేషన్ మధ్య ఉన్న రైల్వే టన్నెల్ మరమ్మతుల కారణంగా ఈనెల 8వ తేదీ నుంచి 63 రోజులపాటు ఈమార్గంలో రైళ్ల రాకపోకలను రైల్వే అధికారులు నిలిపివేయనున్నారు. రైల్వే టన్నెల్ ప్రమాదకరంగా మారడంతో రైల్వే ఉన్నత అధికారులు టన్నెల్ మరమ్మతు పనులు చేపట్టారు. అందువల్ల ఈనెల 8వ తేదీ నుంచి ప్రశాంతి రైల్వే స్టేషన్ కు వచ్చే రైళ్లు పూర్తిగా నిలిపివేయనున్నారు. ప్రశాంతి రైల్వే స్టేషన్ నుంచి హైదరాబాద్, విజయవాడ, కలకత్తా, బాంబే, ఢిల్లీ తదితర నగరాల వైపు వెళ్లే అన్ని రైళ్లను నిలిపివేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

కొన్ని రైళ్లు మాత్రం ధర్మవరం నుంచి నాగసముద్రం మీదుగా బెంగళూరు వైపు వెళ్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 8వ తేదీ నుంచి ఫిబ్రవరి నెల 8వ తేదీ వరకు రైళ్ల రాకపోకలు నిలిపివేయనున్నట్లు రైల్వే అధికారులు ప్రశాంతి రైల్వే స్టేషన్ లో ఉంచిన బోర్డులో వెల్లడించారు. కావున పుట్టపర్తికి వచ్చే యాత్రికులు, ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని రైల్వే అధికారులు కోరారు. ఏది ఏమైనా 63 రోజుల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రశాంతి రైల్వే స్టేషన్ నిర్మానుష్యంగా మారనుంది. దేశంలోనే పలు నగరాలకు ప్రశాంతి రైల్వే స్టేషన్ నుంచి నిత్యం రైళ్ల రాకపోకలు ఉండగా ఈనెల 8 నుంచి రైళ్ల రాకపోకలు నిలిచిపోయే అవకాశం ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement