Sunday, May 26, 2024

KNL: రోడ్డు ప్రమాదంలో.. ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలు

ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అవుకు మండలం సింగనపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలయ్యాయి.. మోటార్ బైక్ ను ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని అవుకు పట్టణానికి చెందిన రవి, సాయి, మహేంద్ర అనే యువకులుగా గుర్తించారు.

జేసీబీ పని నిమిత్తం ఆకుమల్ల గ్రామానికి వెళ్ళి తిరిగివస్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటో మోటార్ బైక్ ను ఢీకొంది. ఈ ప్రమాద ఘటనలో గాయపడిన ముగ్గురు యువకులను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఈ రోడ్డు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement