Wednesday, May 22, 2024

TDP – ఐదు చోట్ల అభ్యర్థుల మార్పు – ఉండి టికెట్ రఘురామకృష్ణ రాజుకే

అమరావతి – బీఫామ్‌లు ఇచ్చేముందు టీడీపీ అధినేత చంద్రబాబు బోలెడెన్ని ట్విస్టులు ఇచ్చారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఐదు నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేయడంతో తెలుగు తమ్ముళ్లు షాక్ తిన్నారు. ఇదంతా బీఫామ్స్‌ ఇచ్చేముందు జరగడంతో కొందరు నేతలు తీవ్ర అసంతృప్తికి లోనైనప్పటికీ.. వారిని పిలిపించి బుజ్జగించే పనిలో చంద్రబాబు, సీనియర్లు ఉన్నారు. మరోవైపు ఇవాళే మొత్తం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు బీఫామ్‌లను చంద్రబాబు స్వయంగా తన చేతుల మీదుగా ఇస్తున్నారు

ఇక ఉండి అసెంబ్లీ నుంచి రఘురామకృష్ణ రాజు, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, మడకశిర నుంచి ఎమ్మెస్ రాజు, వెంకటగిరి నుంచి కురుగుండ్ల రామకృష్ణ, మాడుగుల నుంచి బండారు సత్యనారాయణ మూర్తిని అభ్యర్థులుగా చంద్రబాబు ప్రకించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement