Monday, June 24, 2024

TDP Alliance – ప్రభుత్వంలో పవర్ స్టార్ – జనసేనానికే హోంశాఖ

డిప్యూటీ సీఎం సహా మరో కీలక శాఖ
చంద్రబాబు ప్రతిపాదన.. పవన్ ఓకే
కేబినేట్ కూర్పుపై బాబు ఫోకస్
రేపు బెజవాడలో కూటమి భేటీ
26 మందితో మంత్రి మండలి ప్రమాణం?
టీడీపీకి 22 బెర్త్ లు
జనసేనలో అయిదారుగురు ఆశావహులు
బీజేపీకి ఒకటా? రెండా?
మిత్రులకు ఎన్ని బెర్త్ లో సస్పెన్స్

( ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి)
కొద్ది రోజులుగా ఏపీలో నూతన ప్రభుత్వంలో జనసేన అధినేత చేరుతారా లేదా అనే ఒక సందిగ్ధత పవర్ స్టార్ ఓ క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది. చంద్రబాబు సూచన మేరకు పవన్ భవిష్యత్ బాధ్యతల పైన ఒక నిర్ణయానికి వచ్చారట. ఈ స్థితిలో కొత్త ప్రభుత్వంలో పవన్ పాత్ర సుస్పష్టమైంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకే ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ అని తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలకు అంగీకరంచార ని సమాచారం. . ప్రస్తుతం చేతిలో సినిమాలు ఉండటంతో మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశం పైన ఆయన కొన్ని రోజులుగా డైలమాలో ఉన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ప్రభుత్వంలో చేరాలని నిర్ణయించారు. తాజాగా, ఒక జాతీయ మీడియాతో పవన్ ఈ విషయాన్ని స్పష్టం చేసారు. ఇదే అంశం పైన చంద్రబాబు, పవన్ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. జనసేనకు నాలుగు మంత్రి పదవులు దక్కనున్నట్లు సమాచారం. జనసేన నుంచి ఎవరికి మంత్రి పదవులు ఇవ్వాలి.. ఏ శాఖలు ఇవ్వాలనే దాని పై ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారని ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

డెప్యూటీ సహా .. కీలక శాఖలు

చంద్రబాబుతో పాటుగానే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటం ఖాయమైనట్లు సమాచారం. ఇక..పవన్ కల్యాణ్ కు కీలక శాఖలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. అందులో భాగంగా గత అయిదేళ్ల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని చంద్రబాబు, పవన్ ప్రతీ సభలోనూ అన్నారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వంలో స్థానిక సంస్థలు, పంచాయితీలకు అధికారాలు,.. నిధులు ఇవ్వకపోవటం పైన పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. దీంతో..ఏపీలో కీలకమైన ఈ అంశాల పైన పవన్ తానే ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే అంశం పైన చంద్రబాబుతో నూ చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ స్థితిలో డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కు హోం శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రంలో జనసేనకు మంత్రి పదవి దక్కకపోవటంతో ఏపీలో జనసేనకు 4-5 శాఖలు కేటాయించాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. తొలి సారిగా అసెంబ్లీలో అడుగు పెడుతూనే..పవన్ తీసుకొనే కొత్త బాధ్యతల నిర్వహణ పైన ఆసక్తి కనిపిస్తోంది.

రేపు ఏపీ కూటమి భేటీ

కేబినేట్ కూర్పుపై ఏపీ కూటమి ఎమ్మెల్యేలు మంగళవారం విజయవాడలోని కన్వెన్షన్ హాలులో సమావేశం కానున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు జరగనున్న ఈ సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు. ఈ భేటీలో ఎల్పీ నేతగా చంద్రబాబును ఎన్నుకోనున్నారు. బుధవారం ఉదయం దాదాపు పదకొండున్నర గంటల సమయంలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మిత్రులకు ఎన్ని బెర్త్ లో…

జనసేన నుంచి నలుగురైదుగు రు మంత్రి పదవుల కోసం పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం సీఎంతో కలిసి 26 మందికి ఛాన్స్ ఉంది. ఆ లెక్కన కొత్త జిల్లాలు 26 ఉన్నాయి. జిల్లాకు ఒకరికి మంత్రిగా ఛాన్స్ ఇస్తారా? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ నుంచి సీనియర్లు ఈసారి పదవులు ఆశిస్తున్నారు. ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకోవడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఈ రోజు..రేపు పవన్..బీజేపీ నేతలతో చంద్రబాబు కేబినెట్ కూర్పు పైన తుది కసరత్తు జరుగుతోంది. ఇందులో మంత్రుల పేర్లు..శాఖలు ఖరారు కానున్నాయి. కొత్త ఎన్నికైన మహిళలకు అవకాశం ఇవ్వనున్నారు. లేదంటే రెండున్నర ఏళ్లకు కేబినెట్‌ను మార్చే అవకాశాన్ని తోసిపుచ్చలేమని అంటున్నారు. దాదాపుగా 22 మంది టీడీపీ ఎమ్మెల్యేలను మంత్రి మండలిలోకి తీసుకోవాలన్నది అధినేత ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనసేనకు మూడు, బీజేపీకి ఒకటి ఇవ్వవచ్చని అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement