Friday, May 3, 2024

Alert : భానుడిప్రతాపం… వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌..

వేస‌వి తీవ్ర‌త విప‌రీతంగా పెరిగింది. బ‌య‌ట‌కు వెళ్లాలంటేనే జంక‌ల్సాని ప‌రిస్థితి నెల‌కొంది. రోజురోజుకు రికార్డుస్థాయిలో ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదువుతున్నాయి. క్ర‌మేణా వ‌డ‌గాల్పులు పెరుగుతున్నాయి. ఉక్కపోత‌తో జ‌నం విల‌విలాడుతున్నారు. రెండు రాష్ట్రాల్లో అధిక టెంపరేచర్లు నమోదవుతున్నాయి. ఈ సమయంలో వాతావరణ శాఖ తాజాగా అలర్ట్స్ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

వేసవి ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా ఎండతీవ్రతతో పాటు వడగాల్పులు మరింత పెరుగుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం 130 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా, మన్యం జిల్లా కొమరాడలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని తెలిపింది. శుక్రవారం 253 మండలాల్లో వడగాల్పులు, 5 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. వివిధ జిల్లాల్లోని 59 మండలాల్లో వడగాల్పులు వీచగా, కడప జిల్లా వీరపునాయుని మండలంలో తీవ్ర వడగాల్పులు వీచాయి.

- Advertisement -

వర్షాలు వచ్చేస్తున్నాయ్​…
వాతావరణశాఖ తెలంగాణ ప్రజలకు ఓ తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే వర్ష సూచన ఉందని, ఎండల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందని వివరించింది. రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని ఆ తరువాత రెండు రోజులు 7, 8 తేదీల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement