Thursday, April 25, 2024

AP : జూన్ నెల శ్రీవారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

ఇవాళ జూన్‌నెల‌కు సంబంధించిన శ్రీ‌వారి ఆర్జిత సేవాల టికెట్ల కోటాను టీటీడీ విడుద‌ల చేయ‌నుంది. ఉదయం శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరుగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో పాల్గొనేందుకు నేడు భక్తులకు అందుబాటులో ఉంచుతారు.

కాగా, మధ్యాహ్నం శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. మార్చి 23న అంగప్రదక్షిణం టోకెన్లు, శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా, వృద్ధులు, దివ్యాంగుల దర్శనటికెట్ల కోటాను విడుదల చేస్తారు. 25న రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లు, తిరుమల, తిరుపతిలోని గదుల కోటాను విడుదల చేస్తారు. 27న తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, అదేరోజు మధ్యాహ్నం నవనీత సేవ కోటాను, పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతారు.https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement