Sunday, April 28, 2024

Smart Exclusive – విశాఖలో లంగరేసిన జీవీఎల్ .. లోక్​సభకు సై

స్టీల్ సిటీలో పాగాకు తీవ్ర యత్నాలు
ఆశల పల్లకిలో కమలనాథులు
టీడీపీ, జనసేనతో పొత్తు లేకున్నా సరే
ఒంటరి పోరుకు రెడీ అంటున్న కాషాయదండు
హైకమాండ్​ సపోర్టు.. లోకల్​గా గుడ్​ నేమ్..
ఇవీ కలిసివచ్చే అంశాలంటున్న శ్రేణులు​


లోక్​సభ ఎన్నికల్లో విశాఖ‌ప‌ట్నంపై బీజేపీ దృష్టి సారించింది. టీడీపీ, జ‌న‌సేన‌తో పొత్తు కుదిరినా కుద‌ర‌క‌పోయినా ఇక్కడి నుంచే పోటీ చేయాల‌ని ఫిక్స్ అయ్యింది. పోటీకి అభ్యర్ధినీ కూడా సిద్దం చేసేసింది. ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న జీవీఎల్ నరసింహారావు లోక్‌సభ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తహతహలాడుతున్నారు. ప్రజాక్షేత్రంలో పెద్దగా కనిపించని జీవీఎల్ మీడియాలో మాత్రం డిబేట్లతో చెలరేగుతారు. ఏపీకి చెందిన ఈ నేత వాగ్దాటికి మైమరచిన బీజేపీ పెద్దలు రాజ్యసభకు పంపించారు. ఇప్పుడు లోక్‌సభలో ఎంట్రీ ఇవ్వాలని చూస్తున్న జీవీఎల్ వైజాగ్‌పైనే మనసుపడ్డట్టు తెలుస్తోంది. దీనికి అధిష్టానం క‌రుణ ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు గురించి ఆలోచిస్తే.. ఏపీ పాలిటిక్స్‌లో ఆ పేరు సుపరిచితమే. మీడియాలో అనర్గళంగా మాట్లాడేస్తూ ఏపీలో బాగానే పాపులర్ అయ్యారు. ప్రస్తుత బాపట్ల జిల్లా బల్లికురువలో ఆయన జన్మించారు. ఆయన తండ్రి ముప్పై ఏళ్లు సర్పంచ్​గా పని చేశారు. అదే జీవీఎల్‌కి రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసిందంటారు. జీవీఎల్ ఉన్నత చదువులు కూడా గుజరాత్‌లో కొనసాగాయి. ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న అతను కొన్నేళ్లుగా బీజేపీలోనే కొనసాగుతున్నారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు.

రాజ్యసభకు పంపిన అధిష్టానం..

జీవీఎల్ వాక్ చాతుర్యం, పట్టుదల చూసిన పార్టీ అధిష్టానం 2018లో ఉత్తర్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది. అప్పటి నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన ఖాళీ దొరికితే చాలు వైజాగ్‌లో వాలిపోతుంటారు. కొన్నేళ్లుగా విశాఖ చుట్టే తిరుగుతున్నారు. బీజేపీ కార్యక్రమాలతో పాటు తన సొంత ఎజెండాతో మరికొన్ని కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉనికిని చాటుకునే యత్నం చేస్తున్నారు. అది ఎంతలా అంటే సిట్టింగ్ ఎంపీ ఫ్లెక్సీల కన్నా విశాఖ సిటీలో జీవీఎల్ ఫ్లెక్సీలే ఎక్కువుగా కనపడుతుంటాయి. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నా ఎప్పటి నుంచో విశాఖ బరిలో దిగాలానే కోరిక ఉండటంతో ఫ్లాట్ ఫామ్ రెడీ చేసుకుంటూ వస్తున్నారు.

అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు..
20 ఏళ్లుగా విశాఖ ఎంపీలుగా నాన్ లోకల్ వ్యక్తులే గెలుస్తున్నారు. దీంతో జీవీఎల్ విశాఖను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు విశాఖ లోక్ సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాలకే అన్ని పార్టీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2004లో నేదురుమల్లి , 2009లో పురందేశ్వరి, 2014లో కంభంపాటి హరిబాబు, 2019లో ఎంవీవీ సత్యనారాయణ. వీరంతా నాన్ లోకల్ లీడర్లే. ఆ లెక్కలతోనే 2024 ఎన్నికల్లో జీవీఎల్ తన అదృష్టాన్ని పరీక్షించుకునే యత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని అభ్యర్దిగా ప్రకటించింది. బొత్స ఝాన్సీ రాజకీయ నేపథ్యం, భర్త బొత్స సత్యనారాయణ మంత్రి కావడం, ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, బీసీ కులానికి చెందిన వాళ్లు కావడంతో రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది.

టీడీపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు..
టీడీపీ నుంచి గత ఎన్నికల్లో పోటీచేసిన విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి మనవడు, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ లైన్​లో ఉన్నారు. భరత్ కుటుంబం ఈస్ట్ గోదావరి నుంచి వలస వచ్చినా ఎన్నో దశాబ్దాలుగా విశాఖలోనే ఉండటంతో నాన్ లోకల్ అన్న ప్రసక్తే లేదు. వైసీపీ, టీడీపీ అభ్యర్డులకు లోకల్ అనే ముద్ర ఉంది. అయితే.. నాన్ లోకల్ జీవీఎల్ విశాఖ ఎంట్రీ వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో బీజేపీకి విశాఖ ఎంపీ సీటు ఇచ్చినట్లు .. ఈ సారి అక్కడ నుంచి బీజేపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలన్నది జీవీఎల్ ఆలోచనగా తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే .. తనకు పార్టీలో ఉన్న పరిచయాలతో సీటు గెలుచుకోవాల‌ని భావిస్తున్నారు..

విశాఖనే ఎందుకు అన్నది చర్చ..
జీవీఎల్ విశాఖనే ఎందుకు ఎంచుకున్నారనేదే ఇప్పుడు చర్చల్లో నలుగుతోంది. ముఖ్యంగా 2014 ఎన్నికల సరళి ఈసారి తనకి కలసి వస్తుందని ఈ లీడర్​ భావిస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు గత 20 ఏళ్లల్లో నాన్ లోకల్ అభ్యర్డులు గెలవడం, రానున్న ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే ఈజీగా తాను గెలవచ్చు అనే అభిప్రాయం కూడా తన ప్లాన్​లో భాగంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోపక్క విశాఖ నగరంలో నార్త్ ఇండియాకు చెందిన మార్వాడీలు, గుజరాతీస్, పంజాబీస్ ఎక్కువగా ఉంటారు. వీళ్లతో పాటు ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ ఉద్యోగుల కుటుంబాలు కూడా ఉన్నాయి. వారంతా బీజేపీకి ఓటు వేస్తారనే నమ్మకంతో జీవీఎల్ ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement