Friday, May 17, 2024

Shock – వైసిపికి ఎమ్మెల్యే చంటిబాబు ఝ‌ల‌క్ …సైకిల్ ఎక్కేందుకు రెడీ..

జ‌గ్గంపేట – వైసీపీకి మరో షాక్ తగలబోతోంది. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నారు. వచ్చే నెల 5 లేదా 6న ఆయన టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్టు చెపుతున్నారు. ఇప్పటికే టీడీపీ కీలక నేతలతో చర్చలు పూర్తయినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట నుంచి వైసీపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఆయన టీడీపీలో చేరనున్నారు. అయితే, జగ్గంపేట టికెట్ ఇవ్వలేమని టీడీపీ పెద్దలు ఆయనకు చెప్పారని, దీంతో, మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాన్ని తనకు ఇవ్వాలని టీడీపీ నేతలను ఆయన కోరినట్టు సమాచారం.

2009, 2014 ఎన్నికల్లో జగ్గంపేట నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన జ్యోతుల చంటిబాబు ఓటమిపాలయ్యారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను ఏలేరు ప్రాజెక్ట్ ఛైర్మన్ గా చంద్రబాబు నియమించారు. అయితే వైసీపీ నుంచి టీడీపీలోకి జ్యోతుల నెహ్రూ రావడంతో ఆయన వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏలేరు ప్రాజెక్ట్ చైర్మన్ గా చంటిబాబును నియమించారు.. అయితే, వచ్చే ఎన్నికల్లో జగ్గంపేట వైసీపీ టికెట్ జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని క్లారిటీ కూడా వచ్చిందంట.. దీంతో మళ్లీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు… అయితే, జ్యోతుల నెహ్రూ, జ్యోతుల చంటిబాబు సమీప బంధువులు.. ఎమ్మెల్యేగా ఉంటే తానుండాలి, లేదంటే తన కుటుంబానికి చెందిన వారు ఉండాలి.. కానీ, బయటి వారికి ఎలా మద్దతిస్తామని అనుచరులతో చంటిబాబు వ్యాఖ్యానించినట్టు ప్రచారం సాగుతోంది.. జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వలేమని టీడీపీ తేల్చిచెప్పినప్పటికీ.. ప్రత్యామ్నాయంగా వేరే చోట నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని చంటిబాబు కోరుతున్నారట..

కాగా, కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి చెందిన జ్యోతుల చంటిబాబు ఆ మధ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.. ‘పార్టీలు, గాడిద గుడ్డు.. ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి.. మేం ఏమైనా ఈ పార్టీ లో శాశ్వతమా? అంటూ ఆయన హాట్‌ కామెంట్లు చేశారు.. ఏ పార్టీలో ఎవరు శాశ్వతం.. ఇప్పుడున్న వారు రేపు ఇంకో పార్టీలో ఉంటారేమో..? రేపు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో..? ఎవరికి తెలుసు..? అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద చర్చగా మారిన విషయం విదితమే.

Advertisement

తాజా వార్తలు

Advertisement