Saturday, April 27, 2024

Screen to Politics – మంత్రి రోజా జీవిత చరిత్రపై బుక్ రిలీజ్

మంత్రి రోజాకు సంబంధించి జీవిత చరిత్ర బుక్‌ను ఇవాళ విడుదల చేశారు. ‘రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి.. రోజా సెల్వమణి’ అనే పేరుతో పుస్తకాన్ని రాశారు. ఈ బుక్‌ను అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డిలు విడుదల చేశారు. సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి మంత్రి స్థాయికి ఎలా ఎదిగారనే విషయాలు ఈ పుస్తకంలో పొందుపర్చారు.

సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా ఎన్నో వైవిద్యభరితమైన పాత్రలను పోషించి అనతి కాలం లోనే సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి రోజా. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో దాదాపుగా అందరి స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈమె సినీ కెరీర్ ఎన్నో ఒడిదుడుగులు, ఎత్తుపల్లాలు మధ్య కొనసాగింది. మొదటి నుండి సామాజిక స్పృహ ఉన్న రోజా ప్రజాసేవ చెయ్యడం కోసం తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. నగరి స్థానం నుండి టీడీపీ ద్వారా రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన రోజా, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ లో చేరింది. వై ఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత ఆయన తనయుడు జగన్ స్థాపించిన వైసీపీ లో చేరి అదే నగరి స్థానం నుండి రెండు సార్లు పోటీ చేసి ఎమ్మెల్యే గా గెలుపొందింది. అలా అటు సినీ జీవితం లోను, ఇటు రాజకీయ జీవితం లోను ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని మగవాళ్ళతో సమానంగా ఫైర్ బ్రాండ్ గా రోజా ఎదిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement