Sunday, April 28, 2024

RIP – తొలి త‌రం ప్ర‌ముఖ న్యూస్ రీడ‌ర్ శాంతి స్వ‌రూప్ క‌న్నుమూత

దూర‌ద‌ర్శ‌న్ లో తొలి న్యూస్ ప్రెజంట‌ర్
1983 నవంబర్ 14న తొలిసారిగా వార్త‌లు చ‌దివిన శాంతి స్వ‌రూప్
టెలీప్రాంప్టర్ లేకుండా త‌ప్పుల లేకుండా చ‌ద‌వ‌డం ఆయ‌న ప్ర‌త్యేక
తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా చెరగని ముద్ర
2011 వ‌ర‌కు దూర‌ద‌ర్శ‌న్ లోనే జీవితం

హైద‌రాబాద్ తెలుగులో మొట్టమొదట న్యూస్ రీడ‌ర్ గా గుర్తింపు పొందిన శాంతిస్వరూప్ ఇక లేరు. శాంతి స్వరూప్ శుక్రవారం ఉదయం గుండె పోటుతో కన్నుమూశారు. హైదరాబాదులోని మలక్ పేటలో ఉన్న యశోద ఆసుపత్రిలో గుండెపోటు అనంతరం చికిత్స పొందుతూ ఆయన కోలుకోలేక మృతి చెందారు

తొలిత‌రం యాంక‌ర్ క‌మ్ న్యూస్ రీడ‌ర్

తెలుగు ప్రజలకు వార్తలు చెప్పిన మొట్టమొదటి వ్యక్తి శాంతి స్వరూప్. ఇప్పుడన్న ఛానెల్స్ అప్పుడు లేవు, ఇప్పున్నంత మంది యాంకర్లుకూడా అప్పుడు లేరు. ముఖ్యంగా చాలా కాలం పాటూ తెలుగుకు ఒక మేల్ యాంకర్, ఒక ఫిమేల్ యాంకర్ మాత్రమే ఉండేవారు. అలాంటి టైమ్‌లో శాంతి స్వరూప్ తెలుగు న్యూస్‌కు చుక్కానిలా పని చేశారు.

ఆయన రాత్రి తొమ్మది గంటల న్యూస్ ఎప్పుడు చదువుతారా అని ఎదురు చూసేవారు. 1983 నవంబర్ 14న దూరదర్శన్ చానెల్‌లో శాంతి స్వరూప్ తెలుగులో తొలిసారి వార్తలు చదివారు. పదేండ్ల పాటు టెలీప్రాంప్టర్ లేకుండా పేపర్ చూసి వార్తలు ప్రజలకు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడర్‌గా చెరగని ముద్ర వేశారు. 2011 వరకు శాంతి స్వరూప్ వార్తలు చదువుతూనే ఉన్నారు.

1983లో మొదటి సారి వార్తలు..
1980లో యాంకర్‌ రోజారాణితో శాంతి స్వరూప్‌కు వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో ఉంటున్నారు. 1983 నవంబర్‌ 14న సాయంత్రం 7 గంటలకు ఫస్ట్‌ బులెటిన్ అప్పట్లో ఒక సంచలనం అయింది. అప్పుడే మొట్టమొదటిసారిగా శాంతి స్వరూప్ లైవ్‌లో న్యూస్‌ చదివారు. 1978లోనే ఆయన ఉద్యోగంలో చేరినా వార్తలు చదివింది మాత్రం 1983లో. అప్పట్లో టెలీ ప్రాంప్టర్‌ కూడా ఉండేది కాదు. స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి వార్తలు చెప్పేవారు శాంతిస్వరూప్‌. టీవీల్లోకి రాక ముందు ఈయన కొంతకాలం ఆకాశవాణిలో పనిచేశారు.

- Advertisement -

విలక్షణ శైలి…
శాంతి స్వరూప్‌ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఎలాంటి కార్యక్రమమైనా ఏకధాటిగా నడపగల దిట్ట.రామంతాపూర్‌లోని టీవీ కాలనీలో ఆయన నివాసం. 20ఏళ్లకు పైగా తెలుగు వార్తలు చదివిన ఏకైక వ్యక్తిగా శాంతి స్వరూప్ ఘనత వహించారు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. ఎలాంటి వార్త అయినా ఒకేలా చదవడం ఆయన ప్రత్యేకత.

శాంతి స్వరూప్ పట్ల రాజకీయ ప్రముఖులు, అలాగే జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement