Wednesday, July 24, 2024

Restrictions – చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. రేపు గ‌న్నవరం ఎయిర్‌పోర్టు వ‌ద్ద‌ ట్రాఫిక్‌ ఆంక్షలు

ఎపి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయ పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. బుధవారం నాడు విమాన ప్రయాణికులు ఉదయం 9.30 గంటల్లోపే చేరుకోవాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ ఎం.లక్ష్మీకాంత రెడ్డి సూచించారు. ప్రయాణికుల విమానాలేవీ రద్దు చేయలేదని.. అన్నీ యథాతథంగా నడుస్తాయని తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌, బెంగళూరు, తిరుపతి, షిర్డీ వెళ్లే విమానాలు యధావిధిగా బయల్దేరతాయని చెప్పారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విమానాశ్రయ పరిసరాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement