Friday, October 11, 2024

నా మిత్రుడు పోరాట‌యోధుడు … ధైర్యంగా ఉండండిః నారా లోకేష్ కు ర‌జ‌నీకాంత్ ఫోన్

చెన్నై – టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో క‌డిగిన ముత్యంలా తిరిగివ‌స్తార‌ని సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అన్నారు.. రిమాండ్ ఖైదీగా చంద్ర‌బాబు ప్రస్తుతం రాజమండ్రి జైలులో నేపథ్యంలో, నారా లోకేశ్ కు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి పరామర్శించారు. ఇలాంటి సమయాల్లో ధైర్యంగా ఉండాలని సూచించారు.

తన మిత్రుడు చంద్రబాబు గొప్ప పోరాట యోధుడు అని, ఆయన చేసిన అభివృద్ధి, సంక్షేమమే ఆయనకు రక్ష అని ఈ సందర్భంగా రజనీకాంత్ పేర్కొన్నారు. చంద్రబాబు ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప నేత అని కొనియాడారు. ఈ తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు ఆయనని ఏం చేయలేవని రజనీకాంత్ ధీమా వ్యక్తంచేశారు. తనకు ఆత్మీయ మిత్రుడైన చంద్రబాబు తప్పు చేయరని, చేసిన మంచి పనులు, నిస్వార్థమైన ప్రజా సేవ, ఆయనను క్షేమంగా బయటకు తీసుకొస్తాయని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement